హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు ఈనెల 10వతేదీ నుంచి జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ప్రత్యేక చర్చ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. క్యాబినెట్ భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది.