హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): మాజీ డీఎస్పీ ప్రణీత్‌కుమార్ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఎస్ఐబీ (స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో) ఉన్నతాధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది.
ఎస్ఐబీలో పనిచేస్తూ విలువైన సమాచారమున్న హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు ఇతర సామగ్రిని ధ్వంసం చేశాడనే ఆరోపణతో ఆయనపై హైదరాబాద్ పంజాగుట్ట ఠాణాలో ఆదివారం ఎస్ఐబీ అదనపు ఎస్పీ రమేశ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సస్పెండైన డీఎస్పీ ప్రణీత్‌పై కేసు నమోదైంది. ఆయన కోసం పంజాగుట్ట పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.