హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేస్తే.. సుప్రీంకోర్టును వెళ్లాలనే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తున్నది. అనర్హత పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నది.