Telangana | భారీ వర్షాల కారణంగా 768 కి.మీ. మేర దెబ్బతిన్న రోడ్లు.. మరమ్మతు చేయాలంటే 81 కోట్లు కావాలి!
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లకు అధికారులు తక్షణం తాత్కాలిక మరమ్మత్తులు చేస్తున్నారు. వరదలు తగ్గాక పూర్తిస్థాయి మరమ్మత్త్తులు చేయనున్నా రు. పీఆర్, ఆర్అండ్బీ అధికారులు రా ష్ట్ర కార్యాలయం నుంచి నిత్యం పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారు. 768 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని అంచనా వేశారు.
Telangana | హైదరాబాద్, జూలై 28 (నమస్తే తె లంగాణ): భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లకు అధికారులు తక్షణం తాత్కాలిక మరమ్మత్తులు చేస్తున్నారు. వరదలు తగ్గాక పూర్తిస్థాయి మరమ్మత్త్తులు చేయనున్నా రు. పీఆర్, ఆర్అండ్బీ అధికారులు రా ష్ట్ర కార్యాలయం నుంచి నిత్యం పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారు. 768 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని అంచనా వేశారు.
వీటి తాత్కాలిక మరమ్మత్తులకు రూ.30 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించారు. కల్వర్టులు, క్రాస్ డ్రైనేజీ (సీడీ ) వర్కులకు 391 చోట్ల నష్టం వాటిల్లిందని గుర్తించారు. రూ.8.67కోట్లు తాత్కాలిక మరమ్మత్తులకు నివేదించారు. 117 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయని గుర్తించారు. వీటి మరమ్మత్తులకు రూ.42 కోట్లు అవసరమని తేల్చారు. పట్టణాలు, నగర పాలక సంస్థల్లో నిత్యం పరిస్థితిని మున్సిపల్ శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నది. మాసాబ్ ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 1651 మందితో 278 అత్యవసర బృం దాలను ఏర్పాటు చేశారు. 23 వేల ఇం డ్లపై వరద ప్రభావం పడిందని అంచనా వేశారు. 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 53 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. వీటిలో 29 రోడ్లకు మరమత్తులు పూర్తి చేశారు. పట్ట ణ స్థానిక సంస్థల్లో 83 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని గుర్తించారు. 51 కల్వర్టులు, 18 కిలోమీటర్ల డ్రైనేజీలు దెబ్బతిన్నాయని గుర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

