హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): పీఆర్టీయూ టీఎస్ నుంచి బీసీ ఉపాధ్యాయులను తొలగించడం దారుణమని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయుల సంఘమా? లేక అగ్రవర్ణాలకు అనుబంధంగా ఉండే సంఘమా? అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే తమ అనుమానం నిజమేననిపిస్తున్నదని పేర్కొన్నారు.