Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎక్కడ చూసినా చాలామందిలో దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నవారు కనిపిస్తున్నారు. అస్వస్థతతో రోగులు దవాఖానల బాట పడుతున్నారు. సాధారణంగా వాన, చలికాలాల్లో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తాయి. కానీ ఇప్పుడు ఎండాకాలంలోనూ కొన్ని రకాల బ్యాక్టీరియాల కారణంగా ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా వైరల్ జ్వరం కేసులు పెరుగుతున్నాయి. ప్రధానమైన దవాఖానలతో పాటు బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీలు, ఏరియా దవాఖానలకు కోల్డ్ ఎలర్జీతో రోగుల తాకిడీ ఎక్కువయింది.
పొంచి ఉన్న కలరా ముప్పు?
వేసవిలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఆహార పదార్థాలు ఎక్కువసేపు నిల్వ ఉండవు. ఉదయం వండిన ఆహార పదార్థాలు మధ్యాహ్నానికే పాడవుతాయి. ఆహారంలోని బ్యాక్టీరియా అధిక ఉష్ణోగ్రతలతో వేగంగా వృద్ధి చెందుతుంది. నిల్వ చేసిన, కలుషిత ఆహారం వల్ల టైఫాయిడ్, కలరా, హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఇ (కామెర్లు) తదితర వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. వేసవిలో కలుషిత ఆహార పదార్థాలు, కలుషిత నీటి వల్ల కలరా బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో సరైన వైద్యం అందించకపోతే అది ప్రాణాలకే ప్రమాదకరం. అత్యధికంగా విరేచనాలు కావడం వల్ల శరీరంలో నుంచి నీరు, లవణాలు బయటకు పోవడంతో డీహైడ్రేషన్‌కు గురవుతారు. రోగిలో బీపీ పడిపోతుంది. కిడ్నీలు, గుండె పనితీరు దెబ్బతింటుంది. రోగులు ప్రాణపాయ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెప్తున్నారు.
కోల్డ్ ఎలర్జీకి కారణమయ్యే ఆహారాలు
-డాక్టర్ రాజారావు,యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్