హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 26: కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్-2024లో నిధుల దుర్వినియోగం జరగలేదని ఐసెట్ కన్వీనర్, కామర్స్ ప్రొఫెసర్ నర్సింహాచారి తెలిపారు. శనివారం మాట్లాడుతూ.. ఐసెట్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని నిజనిర్ధారణ కోసం విచారణకు తాను సిద్ధంగా నే ఉన్నట్టు తెలిపారు.