Minister KTR | కామారెడ్డి : జుక్కల్( Jukkal ) నియోజకవర్గంలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్ర( Maharashtra ), కర్ణాటక( Karnataka )లో అమలవుతున్నాయా..? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రశ్నించారు. రైతుబంధు( Rythubandhu ), రైతుబీమా( Rythubheema ), కల్యాణలక్ష్మి( Kalyanalaxmi ), మిషన్ భగీరథ( Mission Bhagiratha ) వంటి పథకాలు అమలవుతున్నాయా..? అనే విషయాన్ని నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి కర్ణాటక, మహారాష్ట్రలో కనిపిస్తుందా..? అని అడిగారు. బీఆర్ఎస్ పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.
కామారెడ్డి జిల్లా( Kamareddy Dist ) జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే( MLA Hanumanth Shinde ) ఓ చిరునవ్వుతో ఉండే నేత. నేను ఒకనాడు సాగునీటి శాఖలో ఇంజినీర్‌గా పని చేశాను. ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసిన సమయంలో రైతుల కష్టాలు చూస్తే కళ్లల్లో నీల్లు వచ్చేదని షిండే నాకు చెప్పారు. కానీ ఇవాళ ఈ ప్రాంతంలో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్( Nagamadugu Lift Irrigation ) కు శంకుస్థాపన చేయడం ద్వారా షిండే కళ్లల్లో ఆనందం చూశాను. ఈ ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయి. రైతుల దశాబ్దాల కల నెరవేరబోతుంది అని కేటీఆర్ తెలిపారు.
నీళ్ల పోరాటం ఫలించింది. ఎండిన నిజాం సాగర్( Nizam Sagar ).. సీఎం కేసీఆర్( CM KCR ) పట్టుదలతో మళ్లీ జీవం పోసుకుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. రెండు పంటలకు నీళ్లు ఇచ్చే స్థాయికి చేరుకున్నాం. దీంతో ఈ ప్రాంత రైతన్నల చిరకాల వాంఛ నెరవేరబోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరెంట్ కోసం గోస పడేవాళ్లం. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అవుతుంది. ఎన్నో మార్పులు వచ్చాయి. తాగునీటి కోసం ఒకప్పుడు బిందెలు పట్టుకుని ఆడబిడ్డలు ధర్నాలు చేసేవారు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక.. మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తున్నాం అని కేటీఆర్ చెప్పారు.
గిరిజన తండాలను, గూడెలను గ్రామపంచాయతీలుగా చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. తండాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తాం. గిరిజనులకు సర్పంచ్‌లుగా అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. బిచ్కుంద, పిట్లంను మున్సిపాలిటీలుగా మారుస్తాం. మిగతా మున్సిపాలిటీల కంటే ఈ రెండింటిని అద్భుతంగా తీర్చిదిద్దుతాం అని కేటీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా.. ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించే షిండే మాట్లాడుతారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జుక్కల్ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. మంచి నాయకుడు దొరికినప్పుడు గట్టిగా 10 కాలాల పాటు కాపాడుకోవాలి. గత ఎన్నికల్లో 36 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాను అని చెప్పిండు.. ఈ సారి నాగమడుగు ప్రాజెక్టు తెచ్చినందుకు 72 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించే బాధ్యత మీపై ఉన్నది. ప్రజల పట్ల చిత్తశుద్ధితో పని చేసేవారు కొందరే ఉంటారు. అందులో ఒకరు హన్మంత్ షిండే. అలాంటి నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.