సూర్యాపేట, మార్చి 7 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాలోని కాళేశ్వరం ఆయకట్టు పరిధిలో గల ఎస్సారెస్పీ ప్రధాన కాల్వల్లో గత బీఆర్ఎస్ హయాంలో నిండుగా తొణికిసలాడుతూ నీళ్లు పారగా, నేడు సన్నటి పాయ కనిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే నీటి లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండడం లేదు. జిల్లాలోని ఆయకట్టుకు వారాబందీ షెడ్యూల్లో 1,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ 900 క్యూసెక్కులకు మించి రావడం లేదని అధికారులే అంతర్గతంగా చెప్పుకొంటున్నారు.