హైదరాబాద్, మే31 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ విరమణ పొందిన ఇంజినీర్ల ఎక్స్టెన్షన్లను రద్దు చేయాలని ప్రభుత్వానికి హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. శుక్రవారం రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆయా అసోసియేషన్ బాధ్యులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.