నీలగిరి, మే 4: ఇరిగేషన్ శాఖలో డివిజన్-6 ఈఈగా పనిచేస్తున్న కార్యనిర్వాహక ఇంజినీర్ మద్దెపురి సతీశ్చంద్ర(52)అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. ప్రమాదవశాత్తు కాలువలో జారిపడ్డాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా.. మరేదైన జరిగి ఉంటుందా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సతీశ్చంద్ర కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు బంధువులు పేర్కొన్నారు. ఆయన ప్రమాదవశాత్తు జారి కాలువలో పడి ఈత రాక మునిగి మృతిచెందినట్టు భార్య ప్రవళిక ఫిర్యాదు చేయడంతో నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.