హైదరాబాద్, డిసెంబర్18 (నమస్తే తెలంగాణ): 2019-2022 వరకు మూడేండ్లు వరదలు వచ్చినా బరాజ్‌లు తట్టుకున్నాయని, ఎకడా లోపాలు తలెత్తలేదని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ విశ్రాంత సెక్రెటరీ రజత్‌కుమార్ కా ళేశ్వరం కమిషన్ ఎదుట వెల్లడించారు.
నిబంధనల ప్రకారమే బిల్లుల చెల్లింపులు కొనసాగాయని వివరించారు. కా ర్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను సొంత ఆదాయం సమకూరే వరకు ప్ర భుత్వమే కట్టాల్సి ఉంటుందని తెలిపా రు. కమిషన్ బుధవారం నిర్వహించిన విచారణకు రాష్ట్ర సాగునీటిపారుదలశా ఖ విశ్రాంత సెక్రెటరీ రజత్‌కుమార్ హాజరయ్యారు. పలు అంశాలపై వారిని జస్టి స్ పీసీ ఘోష్ ప్రశ్నించారు.