హైదరాబాద్, అక్టోబర్11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు శుక్రవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో భేటీ అయ్యారు. మేడిగడ్డ బరాజ్ ఘటనపై అధ్యయనం చేసి సిఫారసులు చేసేందుకు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వం లో ఎన్డీఎస్ఏ ప్రత్యేక నిపుణు ల కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కమి టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో బరాజ్‌లను పరి శీలించగా, తుది నివేదికను మాత్రం ఇప్పటివరకు సమర్పించలేదు. ఈ నేపథ్యంలో సాగునీటిపారుదల శాఖ అధికారులతో పలు సాంకేతిక అంశాలపై చర్చించారు.