హైదరాబాద్, జూన్20 (నమస్తే తెలంగాణ) : సాగునీటిపారుదలశాఖ ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్ బదిలీ అయ్యారు. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ఈఎన్సీ అడ్మిన్ అమ్జద్ హుస్సేన్‌కు జనరల్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
ఇదిలా ఉంటే పూర్తిస్థాయి ఈఎన్సీ జనరల్‌గా నియామకమై 2 నెలలు కాకముందే అనిల్‌కుమార్‌ను బదిలీ చేయడం చర్చనీయాంశమైం. ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ జనరల్‌గా మురళీధర్‌ను ప్రభుత్వం నిరుడు ఫిబ్రవరిలో తొలగించింది. ఈఎన్సీ అడ్మిన్ అనిల్‌కుమార్‌కే జనరల్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది. గత ఏప్రిల్ 23నే పూర్తిస్థాయిలో ఈఎన్సీ జనరల్‌గా నియమించింది. కానీ అంతలోనే మళ్లీ బదిలీ చేసింది.