న్యూఢిల్లీ, మే 19 : రైల్వే సేవలన్నింటినీ ఒకే డిజిటల్ వేదిక ద్వారా అందించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ‘స్వరైల్’ పేరుతో సరికొత్త మొబైల్ యాప్ను (SwaRail App) అందుబాటులోకి తెచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసిన ఈ యాప్ను ‘సూపర్ యాప్’గా పేర్కొంటున్నారు. రైల్వే శాఖ అందిస్తున్న దాదాపు అన్ని రకాల సేవలను ఒకే ఛత్రం కిందికి తెచ్చి ఈ యాప్ను రూపొందించారు.