హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్(2013) అధికారి సుబ్బారాయుడు ఇంటర్ క్యాడర్ డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్నారు. మంగళవారం కేంద్ర c ఉ త్తర్వులు జారీ చేశారు. మూడేళ్లపాటు ఇం టర్ క్యాడర్ డిప్యూటేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తూ వెంటనే రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.
గత నెల 17న జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో సుబ్బారాయుడిని డీజీపీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఓఎస్డీగా చేసిన సుబ్బారాయుడు.. వారి కుటుంబానికి దగ్గరైనట్టు తెలిసింది. చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో.. సుబ్బారాయుడిని ఇంటర్ క్యాడర్ డిప్యూటేషన్‌పై ఆంధ్రాకు పంపాలని ఏపీ సీఎంవో కార్యాలయం కోరడంతో.. కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. సుబ్బారాయుడిని తిరుపతి ఎస్పీగా నియమించే అవకాశం ఉందని సమాచారం.