IPS Passing Out Parade | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో 76వ ఐపీఎస్ ప్రొబేషనర్ల అవుట్ పరేడ్ జరిగింది. 2023 బ్యాచ్‌కి చెందిన 188 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేస్తుకున్నారు. వీరిలో 56 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. 76వ ఆర్ఆర్(రెగ్యులర్ రిక్రూట్) ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ హాజరయ్యారు.
శిక్షణ పూర్తి చేసుకున్న 188 మంది ట్రైనీ ఐపీఎస్‌ల్లో ఇంజినీరింగ్ చదివిన వారు 109 మంది, ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు 15 మంది ఉండడం విశేషం. అలాగే, లా (న్యాయ శాస్త్రం) పట్టా పొందిన వారు నలుగురు ఉండగా, ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ పొందిన వారు 28 మంది, సైన్స్ విభాగాల్లో డిగ్రీ చేసిన వారు 22 మంది, కామర్స్ విభాగం వారు ఎనిమిది మంది, ఇతర డిగ్రీలు చేసిన వారు ఇద్దరు ఉన్నారు.
ఇక, 188 మంది ట్రైనీ ఐపీఎస్‌ల్లో యువత అధికంగా ఉన్నారు. 25 ఏళ్ల లోపు వారు 15 మంది ఉండగా, 25-28 ఏళ్ల లోపు వారు 102 మంది ఉన్నారు. మొత్తం 54 మంది మహిళా ఐపీఎ్‌సలు ఉండగా వారిలో 38 మంది అవివాహితలు. అలాగే, 134 మంది పురుషుల్లో 116 మంది అవివాహితులు ఉన్నారు. కాగా, 76వ ఆర్ఆర్ (రెగ్యులర్ రిక్రూట్) ఐపీఎస్ బ్యాచ్‌లో 188 మంది భారతీయులు, 19 మంది విదేశీయులు కలిపి మొత్తం 207 మంది ఫేస్-1 బేసిక్ కోర్సులో శిక్షణ పూర్తి చేశారని అకాడమీ డైరెక్టర్ డైరెక్టర్ అమిత్ గార్గ్ తెలిపారు. 19 మంది విదేశీయుల్లో నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవులకు చెందిన వారు ఉన్నారన్నారు.
ఇవి కూడా చదవండి..
KCR | కేసీఆర్ హయాంలో భారీగా కొలువుల సృష్టి.. పదేండ్లలోనే దాదాపు 30 లక్షల ఉద్యోగాల కల్పన
Mee Seva | స్తంభించిన ‘మీ’ సేవలు.. పది రోజులుగా నిలిచిన సర్టిఫికెట్ల జారీ
Current Charges | త్వరలో కరెంట్ షాక్! నూతన సంవత్సర కానుకగా విద్యుత్తు చార్జీల పెంపుదల తప్పదా?