హైదరాబాద్ : 13వ బుద్ధిస్ట్ కౌన్సిల్ సమావేశానికి(Buddhist Council meeting) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఆహ్వానం(Invitation) అందింది. ఫిబ్రవరి నెల 10, 11వ తేదీల్లో మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కినావట్(Kinawat)లో నిర్వహించనున్న 13వ బుద్ధిస్ట్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై సమావేశాలను ప్రారంభించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బౌద్ధ ధర్మ పరిషత్ ఆహ్వానం పలికింది. ఈ మేరకు మంగళవారం పరిషత్ నాయకులు ఎమ్మెల్సీ కవితను కలిసి ఆహ్వాన ప్రతికను అందించారు.