హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఇటీవలే కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరంలో ఐఐహెచ్‌టీ మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు చేనేత జౌళిశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. సెప్టెంబరు 18న పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో కోర్సు ప్రారంభమవుతుందని చేనేత జౌళిశాఖ తెలిపింది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏండ్ల గరిష్ట వయో పరిమితి విధించినట్టు తెలిపింది. నెలకు రూ. 2500 ైస్టెఫండ్ అందించనున్నట్టు వివరించింది. పోచ ంపల్లి మండలం కమముక్కలహ్యాం డ్లూమ్ పార్క్‌లో ఐఐహెచ్‌టీకి శాశ్వత భవనం నిర్మిస్తున్నట్టు పేర్కొంది.
‘గాంధీ’లోమరో పీజీ కోర్సు
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానలో మరో పీజీ కోర్సుకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. జీరియాట్రిక్స్లో పీజీ(ఎండీ) కోర్సును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ బీఎన్ గంగాధర్ నేతృత్వంలోని ఎన్ఎంసీ అప్పీల్ కమి టీ గత నెల 12న దరఖాస్తు పరిశీలించి, నాలుగు సీట్లు మంజూరు చేసింది.
ఏఈఈ పోస్టుల ఫలితాలు విడుదల
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏఈఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్టు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. 1154 పోస్టుల ఫలితాలు (ప్రొవిజనల్లి సెలెక్టర్ క్యాండిడేట్స్) విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ఫలితాలు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పారు.
బీసీ గురుకులంలో యానిమేషన్ కోర్సు
హైదరాబాద్, ఆగస్టు2 (నమస్తే తెలంగాణ): జ్యోతిబా పూలే బీసీ గురుకులం పరిధిలోని చేవెళ్ల ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి బీఏ యానిమేషన్ కోర్సు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి బీ సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కోర్సులో ప్రవేశానికి శనివారం నుంచి ఈ నెల 17వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించారు. ఇంటర్ పూర్తిచేసిన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు సొసైటీ వెబ్సైట్ లేదా 9032 644463, 9063242329 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మెడికల్లీవ్లో రోస్
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఇంధన శాఖ కార్యదర్శి, టీజీ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ రోనాల్డ్ రోస్ 5 నుంచి 17 వరకు మెడికల్లీవ్లో వెళ్లనుండగా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలప్పగించింది.