భువనగిరి కలెక్టరేట్, ఫిబ్రవరి 5: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన భువనగిరి ఎస్సీ హాస్టల్ పదో తరగతి విద్యార్థినుల ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. భువనగిరి పట్టణ సీఐ సురేశ్‌కుమార్ నేతృత్వంలో ఘటనపై సమగ్రంగా నివేదికను రూపొందిస్తున్నారు. పదో తరగతి విద్యార్థినులు వైష్ణవి, భవ్య హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోగా.. ఘటనా స్థలంలో ఆత్మహత్యకు వినియోగించిన చున్నీ, సూసైడ్ నోట్, డోర్ బోల్టులను స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని పోలీసులు చెప్పారు. హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, ముగ్గురు వంట మాస్టర్లు, ట్యూషన్ టీచర్లు సుజాత, సులోచన, ప్రతిభ, భువనేశ్వరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.