హైదరాబాద్/ నాంపల్లి కోర్టులు జూన్ 10 (నమస్తే తెలంగాణ) : గొర్రెల పంపిణీ అక్రమాలపై ఏసీబీ అధికారులు సోమవారం నుంచి విచారణ చేపట్టారు. మూడు రోజుల పాటు జరిగే ఈ విచారణలో పలు కీలక విషయాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. గొర్రెల పంపిణీ అక్రమాలపై ఇటీవల మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ గుండమరాజు కల్యాణ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సబావత్ రాంచందర్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకొన్నది.
వీరిని ఏడు రోజుల విచారణ కోరగా.. నాంపల్లి కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలు నుంచి ఉదయం పది గంటలకు ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. 12 సాయంత్రం 5గంటలలోపు నిందితులను కోర్టు ఎదుట హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది.