గోదావరిఖని, సెప్టెంబర్ 24: రామగుండం కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. ఎమ్మెల్యే టికెట్‌ను ఐఎన్టీయూసీ కోటాలో సీనియర్ నాయకుడు జనక్ప్రసాద్కే కేటాయించాలని ఐఎన్టీయూసీ వర్కింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. దీంతో టికెట్ తనకేనన్న మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ శిబిరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఐఎన్టీయూసీ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి సింగరేణిలోని 11 డివిజన్ల నుంచి ఐఎన్టీయూసీ నాయకులు తరలివచ్చారు. ఈ సారి ఐఎన్టీయూసీ కోటాలో రామగుండం నుంచి ఐఎన్టీయూసీ సీనియర్ నేత జనక్ప్రసాద్కే టికెట్ కేటాయించాలని ముక్తకంఠంతో ఏకగ్రీవ తీర్మానం చేశారు. లేదంటే సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఐఎన్టీయూసీ సహాయ నిరాకరణ చేస్తుందని తేల్చిచెప్పారు. రామగుండం కాంగ్రెస్ టికెట్ తనకే ఖాయమని ప్రచారంలో దూసుకుపోతున్న మక్కాన్‌సింగ్ ఐఎన్టీయూసీ తీర్మానంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి వెళ్లిపోయారు.