ముక్కు టీకా గట్టిదేనా?

- కొన్ని అనుకూలతలు, మరికొన్ని ప్రతికూలతలు
- రవాణా, వినియోగం మరింత సులభం
- మహమ్మారి వేళల్లో వేగంగా వ్యాక్సినేషన్‌కు అవకాశం
హైదరాబాద్, జనవరి 30: భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన ముక్కు ద్వారా వేసే కరోనా టీకా మూడో దశ ట్రయల్స్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు లభించడంతో దీని పనితీరుపై చర్చ మొదలైంది. ముక్కు ద్వారా వేసే టీకాను బూస్టర్ డోస్‌గా ఇచ్చేందుకు ప్రయోగాలు చేపట్టనున్నారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు రెండు డోసులు వేసుకున్నవారిపై పరిశోధనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముక్కుటీకా పనితీరు, ప్రయోజనాలు, ప్రతికూలతలను పరిశీలిస్తే..
వైరస్ల రహదారి మ్యూకస్ పొరసాధారణంగా వ్యాక్సిన్లను సూది ద్వారా భుజం లేదా తొడల్లోని కండరాలకు లేదా చర్మం, కండరాలకు మధ్య ఇస్తారు. కొన్నింటిని నోటి ద్వారా వినియోగిస్తా రు. కరోనా సహా అనేక రకాల వైరస్లు సాధారణంగా మ్యూకస్ పొర ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తా యి. మ్యూకస్ పొర అనేది ముక్కు, నోరు, ఊపిరితిత్తు లు, జీర్ణవ్యవస్థ, ఇతర శరీర అంతర్గత భాగాల్లో ఉండే సన్నని, తడి పొర. రక్తంలోని తెల్లరక్త కణాలతో సం బంధం లేకుండా ఈ మ్యూకస్ పొరలో ప్రత్యేకంగా రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. దీంతో సూదుల ద్వారా ఇచ్చే వ్యాక్సిన్లు ఈ మ్యూకస్ పొరలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో లేదా ప్రేరేపించడంలో విఫలమవుతున్నాయి. అందుకే వైరస్లు ఈ రోగనిరోధక వ్యవస్థను దాటుకొని శరీరంలోకి వేళ్లి వ్యాధిని కలిగిస్తుంటాయి.
ముక్కు టీకా ఎలా పనిచేస్తుంది?
మ్యూకస్ పొరలోని రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తే వైరస్‌లను శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తల భావన. సాధారణ వ్యాక్సిన్లు రక్తంలోకి చేరిన తర్వాత ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తాయి. ‘ఇమ్యూనో గ్లాబ్యులిన్-జీ’ అనే కణాలు ప్రతిరక్షకాలుగా మారి.. రక్తంలో తిరుగుతూ శరీరంలో ఎక్కడైనా ఆ వైరస్ కనిపిస్తే చంపేస్తాయి. ఇవి మ్యూకస్ పొరలోకి చేరవు. కాబట్టి నేరుగా నోట్లో లేదా ముక్కులో వ్యాక్సిన్‌ను స్ప్రే చేయడం ద్వారా మ్యూకస్ పొరలో ప్రతిరక్షకాలను తయారుచేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మ్యూకస్ పొరలో ‘ఇమ్యూనో గ్లాబ్యులిన్-ఏ’ రకం ఫైటర్ కణాలు తయారవుతాయి. ఇవి గాలి ద్వారా శరీరంలోకి వచ్చే సూక్ష్మజీవులను అక్కడే అడ్డుకొని చంపేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ముక్కు లేదా నోటి ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ ఫలితాలను 1960లో గుర్తించారు. పోలియో వ్యాక్సిన్‌ను సూదిమందు ద్వారా కాకుండా నేరుగా నోటి ద్వారా అందించడం వల్ల వేగంగా పనిచేస్తున్నదని, పోలియో ప్రాథమిక లక్షణాలు ఉన్నవారికి కూడా నయమైందని గుర్తించారు.
- అనుకూలతలు
- సూది ద్వారా ఇచ్చే వ్యాక్సిన్లను వేయాలంటే వృత్తి నైపుణ్యం అవసరం. సిరంజీలు, సూదులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మెడికల్ వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ముక్కు టీకాను ఎవరికివారే సొంతంగా వేసుకొనే అవకాశం ఉంటుంది.
- కరోనా వంటి విపత్తు సమయాల్లో తక్కువ సమయంలో ఎక్కువ మందికి వేగంగా వ్యాక్సిన్లు వేయడానికి ఉపయోగపడుతుంది.
- సంప్రదాయ టీకాలతో పోల్చితే ముక్కు టీకాను రవాణా చేయడం సులభం.
- తక్కువ రోగనిరోధక శక్తి ఉండే మ్యూకస్ పొరను బలోపేతం చేస్తుంది. ఫలితంగా సమర్థంగా వైరస్‌లను అడ్డుకోవచ్చు.
- బూస్టర్ డోస్‌గా వేస్తే అదనపు రక్షణ లభిస్తుంది. అంతకుముందు రెండు డోసుల వల్ల ఉత్పత్తి అయిన ప్రతిరక్షకాలు రక్తంలో ఉంటాయి. తాజాగా ముక్కు టీకా వల్ల మ్యూకస్ పొరలోనూ ప్రతిరక్షకాలు ఏర్పడుతాయి. దీంతో రెండంచెల రక్షణ వ్యవస్థ ఏర్పడుతుంది. వైరస్లు శరీరంలోకి ప్రవేశించగానే అడ్డుకునే అవకాశం ఉంటుంది.
ప్రతికూలతలు
పోలియో వ్యాక్సిన్‌ను నోటి ద్వారా ఇవ్వడం ప్రారంభించిన తొలిరోజుల్లో టీకా వేసిన తర్వాత కూడా పలువురు వ్యాధి బారినపడటం గుర్తించారు. దీంతో ఒక్కోసారి టీకా సరిగా పనిచేయకపోవచ్చని నిర్ధారించి, ప్రత్యేకంగా ఏటా డ్రైవ్‌లు పెట్టి ఒకరికి ఒకటి కంటే ఎక్కువసార్లు పోలియో వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించారు.
జంతువులపై పరిశోధనలు జరిగినప్పటికీ ముక్కు టీకా మనుషుల్లో సమర్థంగా పనిచేస్తుందని చెప్పడానికి తగినన్ని ఆధారాలు లేవు. గతంలో కొన్ని ఫ్లూలకు ఓరల్ వ్యాక్సిన్లు తయారుచేయాలని చూసినా ఫలితం కనిపించలేదు.
టీకా వేసుకున్న తర్వాత ఎన్నిరోజులపాటు రక్షణ ఉంటుందనేది ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

