Telangana Secretariat | హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో సెక్రటేరియట్లో ఆన్లైన్ సేవలన్నీ బంద్ అయ్యాయి. ఎక్కడి ఫైళ్లు అక్కడే ఆగిపోయాయి. ఇంటర్నెట్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో అధికార యంత్రాంగంతో పాటు విజిటర్స్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం ఏంటని ఆయా పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చే విజిటర్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు..? ఇంత పెద్ద వ్యవస్థలో ఇంటర్నెట్ సేవలు పని చేయకపోతే.. రాష్ట్రంలో పరిపాలన ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నిస్తున్నారు.
రేవంత్ రెడ్డి మెడకు కేబుల్స్ కటింగ్ వ్యవహారం చుట్టుకున్న సంగతి తెలిసిందే. ఎవడు త్రవ్వుకున్న గోతిలో వాడే పడతాడు అంటే ఇదేనేమో అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ స్తంభాలకు ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్‌ను కట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది.