హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం ఏకగ్రీవ తీర్మానం చేసింది. సోమవారం తెలంగాణభవన్‌లో అం తర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా ని ర్వహించారు. ప్రభుత్వ చేయూతతోనే రాష్ట్రం లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని వక్తలు కొనియాడారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలకు దేశంలో ప్రత్యేక గుర్తింపు వస్తున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మహిళా విభా గం అధ్యక్షురాలు గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ మే యర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. మ హిళలు అన్ని రంగాల్లో రాణిచేందుకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. తమకు అవకాశం వచ్చిన ప్రతి రం గంలో మహిళలు తమ సత్తాచాటాలని ఆకాంక్షించారు. మహిళలు శక్తికి ప్రతిరూపమని, కు టుంబం నుంచి సమాజం వరకు బాధ్యతాయుతమైన భాగస్వామిగా మహిళలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్సీ వాణీదేవి కొనియాడారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడమే కాకుం డా మార్కెట్ కమిటీల్లోనూ రిజర్వేషన్ కల్పిం చి సీఎం కేసీఆర్ తన అభిమానాన్ని చాటుకున్నారని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నదని స్పష్టంచేశారు. ఈ మేరకు గుండు సధారాణి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం వివిధ రంగాల మహిళలను సత్కరించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకులు సుశీలారెడ్డి, ఎడవెల్లి విజయ, సామల హేమ, బొం తు శ్రీదేవి, మన్నే కవిత ప్రసంగించారు.