హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో 13 నుంచి 15 వరకు అంతర్జాతీ య కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శనివారం బేగంపేట హ రితప్లాజాలో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ.. ఈ ఉత్సవాల్లో 16 దేశాల నుంచి 47 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్లు, 14 రాష్ర్టాల నుంచి 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో శాఖ కార్యదర్శి స్మితాసబర్వాల్, పర్యాటకశాఖ సం చాలకుడు జెండగే హనుమంతు, భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణ, కైట్ ఫెస్టివల్ కన్సల్టెంట్ పవన్ సోలంకి, క్లిక్ కన్వీనర్ లిబి బెంజిమన్ పాల్గొన్నారు.