మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలక పాత్ర
అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఐఏఎంసీ) హైదరాబాద్‌లో ఏర్పాటుచేయడం వివాదాల సత్వర పరిష్కారం దిశగా తీసుకున్న కీలకమైన ముందడుగుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ అభిప్రాయపడ్డారు.
- ట్రిబ్యునల్స్‌లో మహిళల పాత్రను పెంచాలి
- సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఐఏఎంసీ) హైదరాబాద్‌లో ఏర్పాటుచేయడం వివాదాల సత్వర పరిష్కారం దిశగా తీసుకున్న కీలకమైన ముందడుగుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ దినోత్సవాన్ని శనివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. జస్టిస్ హిమా కోహ్లీ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదిక (ఏడీఆర్)పట్ల నమ్మకాన్ని మరింత పెంపొందించే దిశగా హైదరాబాద్ ఐఏఎంసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని చెప్పారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్స్‌లో తగినంత మహిళల ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ఆమె ఎత్తిచూపారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని, ఇందుకు అనేక ఇతర మార్గాలున్నాయని చెప్పారు.
తటస్థత అమలు చేయాలి: జస్టిస్ అరాధే
గతంలో అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి సింగపూర్ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఇక్కడే పరిష్కరించుకోవచ్చని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే పేర్కొన్నారు. కీలక సూత్రాలైన తటస్థత, సమర్థత, అమలు నుంచి వైదొలగరాదని సూచించారు. హైదరాబాద్ ఏఐఎంసీ ఆసియన్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌తో, తెలంగాణ రెరా అవగాహన ఒప్పందం చేసుకున్నది. యూఏఈకి చెందిన న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ఆర్వీ రవీంద్రన్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

