కురవి(సీరోలు): ఇంటర్మీడియట్ విద్యార్థిని నృత్యం చేస్తూ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కళాశాలలలో మంగళవారం 10వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఫేర్వెల్లో భాగంగా విద్యార్థినులు డీజే నృత్యాలు చేస్తున్నారు.
మరిపెడ మండలం తానంచర్ల శివారు సపావట్తండాకు చెందిన సీఈసీ మొదటి సంవత్సరం విద్యార్థిని సపావట్ రోజా నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే విద్యార్థిని 108 వాహనంలో మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.