హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని నిర్ణ యం తీసుకున్నది.
ఇదే నిబంధన నిరు డు అమలుకాగా, ఈ సారి అమలుచేయనున్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక (థియ రీ) పరీక్షలు జరుగనున్నాయి. 9లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు.
ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగబోతున్నాయి. ఇవి ముగిసిన తర్వాత ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు రానున్నాయి.