హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని, ఇందుకు ఆనాటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర బాధ్యులపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన ప్రైవేట్ పిటిషన్‌పై విచారణ జరపాలన్న కింది కోర్టు నిర్ణయాన్ని నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు గురువారం మరోసారి పొడిగించింది.
ఈ కేసులో ప్రతివాది, ఫిర్యాదుదారైన నాగపల్లి రాజలింగమూర్తి కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈలోగా ఫిర్యాదుదారుడు కౌంటర్ దాఖలు చేయాలని మరోసారి ఆదేశించింది.