హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో అరెస్టయి, రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్‌కు మలాజిగిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత నెల 16న పోక్సో కేసులో భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు ఉన్నందున పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ భగీరథ్ తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం ఈ నెల 20 నుంచి 26 వరకు ఆరు రోజులపాటు తాతాలిక బెయిల్ మంజూరుచేసింది.