కాజీపేటలో ఇంటర్సిటీ రైళ్ల తయారీ : అశ్వినీ వైష్ణవ్
రాష్ట్రంలోని కాజీపేట రైల్వే తయారీ యూనిట్లో త్వరలోనే సరికొత్త ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్టవ్ తెలిపారు. న్యూఢిల్లీలో గురువారం రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్‌సింగ్ బిట్టు, సీనియర్ అధికారులతో కలిసి కాజీపేట రైలు తయారీ యూనిట్‌పై సమీక్షించారు.
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాజీపేట రైల్వే తయారీ యూనిట్లో త్వరలోనే సరికొత్త ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్టవ్ తెలిపారు. న్యూఢిల్లీలో గురువారం రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్‌సింగ్ బిట్టు, సీనియర్ అధికారులతో కలిసి కాజీపేట రైలు తయారీ యూనిట్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన కాజీపేట రైల్వే తయారీ యూనిట్ త్వరలోనే పూర్తవుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఒక బహుముఖ రైల్వే రోలింగ్ స్టాక్ తయారీ యూనిట్ అని చెప్పారు. కాజీపేట తయారీ యూనిట్ ద్వారా రాబోయే ఐదేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా నడుపడానికి 200 అత్యాధునిక ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు.
ఈ రైళ్లను దేశమంతటా స్వల్ప, దూర ప్రయాణాల కోసం వినియోగించనున్నామని తెలిపారు. ఈ రైళ్లు సాధారణంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో సుమారు 300 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయని తెలిపారు. ఈ రైళ్లు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్‌తో రూపొందుతాయని వెల్లడించారు. ప్రతి రైలుకూ 20 బోగీలుంటాయని, ప్రతి కోచ్ డిజైన్‌లో ఆధునిక సౌకర్యాలతో ఉంటుందని మంత్రి వివరించారు. ఈ రైళ్లలో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుందని చెప్పారు. రైలు బ్రేకులు వేసినప్పుడు ..అది విద్యుత్తు జనరేటర్‌గా మారి, పునరుత్పత్తి అయిన విద్యుత్తును తిరిగి గ్రిడ్‌లోకి పంపే అధునాతన పరిజ్ఞానంతో తయారు చేస్తున్నట్టు చెప్పారు. పర్యావరణ అనుకూల రవాణా విధానం, రోడ్డు రవాణాతో పోలిస్తే గణనీయంగా తక్కువ కార్బన్ ఉద్గారాలను కలిగి ఉంటుందని అశ్వినీ వైష్టవ్ వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

