హైదారాబాద్ : ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. తలమడుగు మండలం కోశాయి వద్ద మహారాష్ట్ర సరిహద్దులో రైలు పట్టాలు తెగిపోయాయి. రైలు పట్టాలు తెగిన విషయాన్ని గమనించిన గ్రామస్తులు.. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వెంటనే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలును నిలిపివేశారు. రైలు నాందేడ్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్నది. రైలును వెంటనే నిలిపి వేయడంతో ప్రయాణికులకు పెను ముప్పు తప్పినట్లయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.