నర్సంపేట, డిసెంబర్19 : వరంగల్ జిల్లా నర్సంపేట గిరిజన బాలుర గురుకుల విద్యాలయంలో గురువారం అర్ధరాత్రి పాఠశాల విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ దాడిలో 9వ తరగతి విద్యార్థి దీపక్ అపస్మారక స్థితికి చేరుకోగా తోటి విద్యార్థులు ప్రభుత్వ జనరల్ వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి విద్యార్థికి ప్రాణాపాయంలేదని తెలిపారు. ఘర్షణ సమయంలో గురుకులంలో బాధ్యులెవరూ లేకపోవడం గమనార్హం.