హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ-గుజరాత్ మ ధ్య జరుగుతున్న అంతర్రాష్ట్ర శిశు విక్రయాల ముఠా గుట్టు రట్టయ్యింది. ‘ఆపరేషన్ దేవ్’ పేరిట చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భాగంగా ప్రధాన నిందితుడు మురుగన్‌తో సహా పలువురిని మంగళవారం పోలీసులకు చిక్కారు. కాగజ్‌నగర్‌కు చెందిన నాగరాజు అలియాస్ మురుగన్ గతంలో ఐవీఎఫ్ సెంటర్లకు ఎగ్ డోనర్లను సరఫరా చేసే బ్రోకర్‌గా పనిచేశాడు. సులభంగా డబ్బులు సం పాదించేందుకు ఈ దందాలోకి దిగినట్టు పోలీసులు గుర్తించారు.
గుజరాత్లో బాలుడి కిడ్నాప్‌తో గుట్టురట్టు
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఏప్రిల్ 6న దేవ్ అనే నాలుగేండ్ల బాలు డు కిడ్నాప్ అయ్యాడు. కేసును సవాల్‌గా తీసుకున్న అక్కడి పోలీసులు.. కిడ్నాప్ వెనుక తెలంగాణకు చెందిన నెట్వర్క్ ఉన్నట్టు గుర్తించారు. బాలుడి పేరు మీదే ‘ఆపరేషన్ దేవ్’ను ప్రారంభించి దర్యాప్తు వేగవంతం చేశా రు. ఏఐ సాయంతో నిందితుల కదలికలను ట్రాక్ చేసి కాగజ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్లో సోదాలు చేశారు. రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బేరమాడి సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.