నిజామాబాద్ : గులాబ్ తుఫాన్ కారణంగా ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద అంతర్ రాష్ట్ర వంతెన ధ్వంసం అయింది. కొద్దిరోజులుగా తీవ్రమైన వరదతో ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదిలో పూర్తిగా మునిగి పోయిన కందకుర్తి వంతెన శనివారం ఉదయం బయటకు తేలింది.
ఐదు రోజులుగా వరద దాటికి వంతెన ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు ఆర్ అండ్ బీ అధికారులు గుర్తించారు. అంతర్ రాష్ట్ర వంతెనను తాత్కాలికంగా మూసివేసేందుకు మహారాష్ట్ర అధికారులకు తెలంగాణ ప్రభుత్వ సమాచారం చేరవేసింది. వంతెనపై తారు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది.