Paper Leak | కడెం, మార్చి 6 : నిర్మల్ జిల్లా కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రశ్నాపత్రాన్ని ఫొటోలు తీసి బయటకు పంపి జవాబులు తయారు చేయించి కొంతమంది విద్యార్థులకు అందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కడెం ఇన్చార్జి ఎస్ఐ శంకర్, ఖానాపూర్ సీఐ సైదారావు పరీక్షాకేంద్రానికి చేరుకుని.. నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనాకు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఏఎస్పీ కేంద్రానికి చేరుకుని పరీక్ష అయిపోయేన తర్వాత సిబ్బంది, స్కా డ్స్ మొబైల్స్‌ను డిపాజిట్ బాక్స్‌లో వేయించి, కడెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఫోన్లు, వాట్సాప్‌ను చెక్ చేసినట్టు తెలిసింది. ఈ విషయమై ఏఎస్పీని వివరణ కోరగా.. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.