హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఫస్టియర్ పరీక్షలు 6 నుంచి మే 23వ తేదీ వరకు, సెకండియర్ పరీక్షలు 7 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.
మే 6(శుక్రవారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 9(సోమవారం) – ఇంగ్లీష్
మే 11(బుధవారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
మే 13(శుక్రవారం) – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ
మే 16(సోమవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 18(బుధవారం) – కెమిస్ట్రీ, కామర్స్
మే 20 (శుక్రవారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1
మే 23(సోమవారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి
మే 7(శనివారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 10(మంగళవారం) – ఇంగ్లీష్
మే 12(గురువారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
మే 14(శనివారం) – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ
మే 17(మంగళవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 19(గురువారం) – కెమిస్ట్రీ, కామర్స్
మే 21 (శనివారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2
మే 24(మంగళవారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి