హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమై 25తో ముగియనున్నా యి. పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం విడుదల చేశా రు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలుంటాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3 నుంచి 22వరకు నిర్వహిస్తారు. జనరల్, వొకేషనల్ కోర్సు విద్యార్థులకు సైతం ప్రాక్టికల్ పరీక్షలుంటాయి.