హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాల గడువు నేటి(సోమవారం)తో ముగియనుండగా, ఈ నెల 17 వరకు పొడిగించారు. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రవేశ పరీక్ష లేకుండా పదో తరగతి మారుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.
పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్లో https://mjptbcwreis.telangana.gov.in https://mjpabcwreis.cgg.gov.in/TSMJBCWEB దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెగ్యులర్ గ్రూపులతోపాటు వృత్తివిద్యా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని బీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 040 23328266 నంబర్లో సంప్రదించాలని సూచించారు.