హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు సోమవారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. దసరా సెలవులు ముగియడంతో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు కాలేజీలకు దసరా సెలవులను ప్రకటించారు.
కాలేజీల్లో ఎఫ్ఆర్ఎస్ హాజరును అమలుచేస్తుండటంతో విద్యార్థుల గైర్హాజరు శాతాన్ని తగ్గించే దిశగా అధికారులు ప్రయత్నించనున్నారు.