Inter Colleges | హైదరాబాద్ : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు సంబంధించి 2025-26 అకాడమిక్ క్యాలెండర్ విడుదలైంది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. వచ్చే విద్యా సంవత్సరం 226 పనిదినాలు ఉండనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 2న ఇంటర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5వరకు దసరా సెలువులు, జనవరి 11, 2026 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. మార్చి మొదటి వారంలో ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. 2026 మార్చి 31 చివరి పనిదినంగా నిర్ణయించారు.