 
                                                            హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షలు (Inter Exams) ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పరీక్షల టేమ్టేబుల్ను (Inter Time Table) విడుదల చేసింది.

ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. అదేవిధంగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను జనవరి 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ను జనవరి 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటలకు నిర్వహిస్తామని తెలిపింది.
 
                            