Deputy CM | ఇంటర్నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్స్ : డిప్యూటీ సీఎం
Deputy CM | ఇంటర్ నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యాశాఖ అధికారులను అదేశించారు.
హైదరాబాద్ : ఇంటర్ నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్(Integrated residentials ) పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) విద్యాశాఖ అధికారులను అదేశించారు. గురువారం అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలపై విద్యాశాఖ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ వార్షిక సంవత్సరంలో రూ. 2500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం చేపడుతున్నామని , ఒక్కో రెసిడెన్షియల్ భవనానికి ప్రభుత్వం రూ.25 కోట్లు చొప్పున మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు వేర్వేరుగా ఉన్నట్టుగా కాకుండా ఇక ముందు నిర్మించే భవనాలు ఒక చోట ఉండే విధంగా యాక్షన్ ప్లాన్(Action Plan) రూపొందించాలని ఆదేశించారు. ఒకే చోట భవనాల వల్ల స్థల సమస్యను అధిగమించ వచ్చని, అన్ని సామాజిక వర్గాల విద్యార్థుల్లో సోదర భావాన్ని పెంపొందించి కుల రహిత సమాజానికి బాటలు వేయవచ్చని పేర్కొన్నారు.
ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం కోసం మధిర (Madira) నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టు ( Pilot Project ) గా ఎంపిక చేశామని వెల్లడించారు. రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం త్వరగా నిర్మించడానికి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ప్లానింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అబ్దుల్ నదీంను ఆదేశించారు.
నియోజకవర్గాల వారీగా నాలేడ్జ్ కేంద్రాల ఏర్పాటు
ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యే నిరుద్యోగులకు కోచింగ్ సౌకర్యం కోసం నాలేడ్జ్ కేంద్రాలను నియోజకవర్గ కేంద్రాల వారీగా ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ ప్రకటించునున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగులకు ఆర్ధిక వెసలుబాటు కల్పించడానికి ఈకేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

