542 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు
కూరగాయలు, పండ్లు, పూలు, చేపలు, మాంసం అన్నింటినీ ఒకేచోట విక్రయించేందుకు ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ల నిర్మాణ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, వేగం పెంచేందు కు కృషిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో రూ.542 కోట్ల అంచనా వ్యయం తో వీటిని నిర్మించనున్నారు.
- 125 పట్టణాల్లో స్థలాల గుర్తింపు పూర్తి
- రాష్ట్రవ్యాప్తంగా ఒక మోడల్లో నిర్మాణం
- వ్యర్థాల నుంచి విద్యుత్తు, బయోగ్యాస్, ఎరువుల తయారీ యూనిట్లు
- కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం ఒకేచోట లభ్యం
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): కూరగాయలు, పండ్లు, పూలు, చేపలు, మాంసం అన్నింటినీ ఒకేచోట విక్రయించేందుకు ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ల నిర్మాణ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, వేగం పెంచేందు కు కృషిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో రూ.542 కోట్ల అంచనా వ్యయం తో వీటిని నిర్మించనున్నారు. ఇప్పటికే 125 పట్టణ స్థానిక సంస్థల్లో 132 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యింది. నగరం, పట్టణం మధ్య లో ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా స్థలాలను ఎంపిక చేస్తున్నారు. ఆయా స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర నిర్మాణాలు ఉంటే వాటిని కూల్చివేసి, భూమిని చదును చేస్తున్నారు. వీటీలో 61 చోట్ల పనులు మొదలయ్యాయి. మరో 29 చోట్ల టెండర్ల దశకు చేరుకొన్నాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లో 2, ఖమ్మం, రామగుండంలో 3 మార్కెట్ల చొప్పున నిర్మిస్తున్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట, ధర్మపురి, మంథనిల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం పూర్తయ్యింది. ఒక్కొక్క మార్కెట్‌కు ఎకరం నుంచి రెండెకరాల స్థలంకేటాయిస్తున్నారు. అన్ని ఒకే మోడల్లో ఉండేవిధంగా డిజైన్లు సిద్ధంచేశారు. 25వేలలోపు జనాభా వున్న ము న్సిపాలిటీల్లో రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.4.50కోట్లు కేటాయించనున్నారు. ప్రతి మార్కెట్లో షెడ్లు, కార్యాలయం, స్టోరేజీ గదులు, ప్రహరీ, మూత్రశాలలు, డ్రైనేజీ, పార్కింగ్, వాహనాల రాకపోకలకు అనువైన రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. పరిశుభ్రతకు అత్యంత ప్రా ధాన్యం ఇస్తున్నారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎక్కువ చెత్త పోగుపడే మార్కెట్లలో వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే యూనిట్లు, బయోగ్యాస్ యూని ట్లు, తక్కువ చెత్తపోగుబడే మార్కెట్లలో సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

