హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సుల అడ్మిషన్లపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. 2026-27 విద్యాసంవత్సరంలో ఈ కోర్సుల్లోని సీట్లను డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) ద్వారా భర్తీచేయాలని నిర్ణయించింది.
ఇప్పటి వరకు కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీగెట్) ద్వారా ఈ కోర్సుల సీట్లను భర్తీచేస్తుండగా, మొత్తం కోర్సులను దోస్త్‌కు బదలాయించింది. కాకతీయ, పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో మొత్తం 370 సీట్లున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.