హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ పాఠశాలలకు దీటుగా రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లను నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ల ఏర్పాటుపై ఆదివారం ఆయన తన నివాసంలో సమీక్షించారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార, సీఎస్ శాంతికుమారి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. క్యాంపస్ల నిర్మాణానికి ఆరిటెక్టులు రూపొందించిన పలు నమూనాలను పరిశీలించారు. నాణ్యమైన విద్యాబోధనకు వీలుగా తరగతి గదులతోపాటు విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా అధునాతన భవనాలు నిర్మించాలని సీఎం సూచించారు. అందుబాటులో ఉన్న స్థలాలకు అనుగుణంగా నమూనాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.