హైదరాబాద్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయ కాంప్లెక్స్(ఐడీవోసీ)ల్లో రూ. 5.80 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సమీకృత జిల్లా కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం ఆదేశించింది.
దీనికి సంబంధించి ఆర్అండ్బీ అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపగా, ఈ మేరకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.