వెంగళరావునగర్, ఏప్రిల్ 27 : పాకిస్థాన్ భూభాగంలో ఇండియా ఉన్నట్టుగా ‘న్యూ మ్యాప్ ఆఫ్ పాకిస్థాన్’ పేరుతో ఇన్‌స్టాలో రీల్ పోస్టు చేశాడు ఓ దేశద్రోహి. ‘పోరా భాయ్.. ఏం చేసుకుంటావో చేసుకో’.. అంటూ బరితెగింపు మాటలు కోట్ చేశాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలోని శాస్త్రిపురానికి చెందిన సయ్యద్ హమీద్(19) భారతదేశంపై దురుద్దేశపూర్వకంగా ఇండియా బోర్డర్ చుట్టూ గ్రీన్ కలర్ వేసి ఇన్‌స్టాలో రీల్ పోస్టు చేశాడు. @iamsyedahmed ఐడీ పేరుతో ఉన్న ఈ రీల్‌ను రహ్మత్‌నగర్‌కు చెందిన సాత్విక్సాగర్ చూసి హమీద్‌పై మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.