KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ఫూర్తితో ఎన్నారై దూడల వెంకట్ ఓ పేద విద్యార్థిని ఎంబీబీఎస్ చదువుకు అండగా నిలిచారు. కేటీఆర్ ద్వారా ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థినికి మొదటి ఏడాది ఫీజుకు సంబంధించిన చెక్కును కేటీఆర్ చేతుల మీదుగా అందించారు. విద్యార్థిని చదువుకు సాయంగా నిలిచిన ఎన్నారై వెంకట్‌ను కేటీఆర్ ప్రశంసించారు.
వనపర్తి జిల్లా కల్వరాల గ్రామానికి చెందిన గౌరికి మెడిసిన్‌లో సీటు వచ్చింది. ఆమెది నిరుపేద కుటుంబం కావడంతో చదువు కోసం ఫీజు చెల్లించలేని స్థితిలో కుటుంబం ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఓ వ్యక్తి ఎక్స్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన కేటీఆర్ గౌరి చదువు పూర్తయ్యే వరకు తానే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేటీఆర్ స్ఫూర్తితో ఆ పేద విద్యార్థిని చదువుకు తన వంతు సాయం అందిస్తానని అమెరికాలో నివసిస్తున్న ఎన్నారై దూడల వెంకట్ ముందుకు వచ్చారు. రూ. లక్షా 65 వేల చెక్కును వెంకట్ తన తండ్రి రవీందర్ ద్వారా ఆమెకు కేటీఆర్ నివాసంలో అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో పాటు వెంకట్ కుటుంబానికి గౌరి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
As Promised Earlier, Today My Father along with KTR Anna had handed over Cheque to Borelli Gouri For her MBBS Studies.
Thanks For Your Time @KTRBRS Anna & Also @KTRoffice who helped in coordinating all this.
I wish you all the very best Gouri. https://t.co/iqU1sNgEhY pic.twitter.com/tHOo80cdal
— Venkat Goud 🇮🇳🇺🇸 (@VenkatBRSUSA) October 14, 2024
ఇవి కూడా చదవండి..
Musi River | మా ఇండ్లను కూల్చకండి.. మూసీ పరివాహక ప్రాంతాల్లో వెలిసిన హైకోర్టు స్టే ఆర్డర్లు
TG Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఐదురోజులు వానలే వానలు..